చిత్రం: సిరివెన్నెల Movie: Sirivennela; సంగీతం: కె. వి. మహదేవన్ Music: K. V. Mahadevan;
వేణువు: పద్మ విభూషణ్ హరిప్రసాద్ చౌరాసియా పండితులు Flute: Padma Vibhushan Pt. Hariprasad Chaurasia
గాయకులు: ఎస్. పి. బి. మరియు సుశీల Singers: S.P.B. and Suseela;
సాహిత్యం: (సిరివెన్నెల) సీతారామ శాస్త్రి Lyrics: (Sirivennela) Sitarama Sastri;
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం ...
ప్రాణ నాడులకు స్పందన నోసగిన ఆది ప్రణవనాదం ఓం ...
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం ...
సరసస్వర సురఝరీగమనమౌ సామవేద సారమిది
నేపాడిన జీవన గీతం ఈ గీతం
విరించి నై విరచించితిని ఈ కవనం
విపంచి నై వినిపించితిని ఈ గీతం
ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రులపైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన
పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా
విశ్వకావ్యమునకిది భాష్యముగా ... || విరించినై ||
జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసములే ... || విరించినై ||
నా ఉచ్ఛ్వాసం కవనం - నా విశ్వాసం గానం ||సరసస్వర ||
No comments:
Post a Comment