E teeruga nanu daya jUcedavO   (rAgam: mAyAmALava gauLa, tALam: Adi)
E teeruga nanu daya jUcedavO ina vaMSOttama rAmA
nA taramA Bhava sAgara meedanu naLinadaLEkshaNa rAmA |E teeruga...|  
Sree raghu naMdana seetA ramaNA Sritajana pOShaka rAmA
kAruNyAlaya Bhakta varada ninu kan&nadi kAnupu rAmA |E teeruga...|   
krUra karmamulu nEraka cEsiti nEramuleMcaku rAmA
dAridryamu parihAramu sEyave daiva SikhAmaNi rAmA |E teeruga...| 
vAsavanuta rAmadAsa pOShaka vaMdanamayOdhya rAmA
dAsArcita mAkaBhayamosaMgave dASarathee raghu rAmA |E teeruga...|
ఏ తీరుగ నను దయ జూచెదవో (రాగం: మాయామాళవ గౌళ, తాళం: ఆది)
ఏ తీరుగ నను దయ జూచెదవో ఇన వంశోత్తమ రామా
నా తరమా భవ సాగర మీదను నళినదళేక్షణ   రామా | ఏ తీరుగ ...|
శ్రీ రఘు నందన సీతా రమణ శ్రితజన పోషక రామా
కారుణ్యాలయ భక్త వరద నిను కన్నది కానుపు రామా | ఏ తీరుగ ...|
క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా
దారిద్ర్యము పరిహారము సేయవే దైవ శిఖామణి రామా |ఏ తీరుగ...|  
వాసవనుత రామదాస పోషక వందనమయోధ్య రామా
దాసార్చిత మాకభయమొసంగవే దాశరథీ రఘు రామా | ఏ తీరుగ ...|
 
 
No comments:
Post a Comment